త‌యారీ కేంద్రంగా తెలంగాణ‌

తెలంగాణ రాష్ట్రం వాణిజ్య కేంద్రంగా మారుతున్న‌ది.  రాష్ట్ర ప్ర‌భుత్వం ఇస్తున్న ఊతంతో.. తెలంగాణ‌లో పెట్టుబడులు పెట్టేందుకు అంత‌ర్జాతీయ కంపెనీలు ఆస‌క్తి చూపుతున్నాయి.  మేటి కంపెనీల రాక‌తో .. తెలంగాణ రాష్ట్రం త‌యారీ కేంద్రంగా మారింది.  అనేక కీల‌క‌మైన ప్రాజెక్టులు తెలంగాణకు మ‌ణిహారంగా నిలుస్తున్నాయి. అత్య‌ధిక స్థాయిలో తెలంగాణ‌లో ఎస్ఈజెడ్‌లు ఆమోదం పొందాయి. రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్ త‌న ట్విట్ట‌ర్‌లో ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు. 


దావోస్‌లో జ‌రుగుతున్న వ‌ర‌ల్డ్ ఎక‌నామిక్ ఫోర‌మ్‌లో ఇవాళ మంత్రి కేటీఆర్ ప‌లు అంత‌ర్జాతీయ సంస్థ‌ల అధిప‌తుల‌తో భేటీ అయ్యారు. కేపీజీఎం గ్లోబ‌ల్ చైర్మ‌న్ బిల్ థామ‌స్‌తో ఇవాళ కేటీఆర్ స‌మావేశం అయ్యారు.  అమెరికాకు చెందిన బీఏఈ సిస్ట‌మ్స్‌తోనూ కేటీఆర్ భేటీ అయ్యారు.  ఆ సంస్థ చైర్మ‌న్ స‌ర్ రోజ‌ర్ కార్‌ను క‌లిశారు. ర‌క్ష‌ణ వ్య‌వ‌స్థ భ‌ద్ర‌త‌కు సంబంధించి బీఏఈ సిస్ట‌మ్స్ ప్ర‌పంచంలోనే నెంబ‌ర్ వ‌న్ సంస్థ‌.  దావోస్‌లోని తెలంగాణ పెవిలియ‌న్ వ‌ద్ద హెచ్‌సీఎల్‌టెక్ అధినేత క‌ల్యాణ్ కుమార్‌తో నూ కేటీఆర్ భేటీ అయ్యారు. మ‌హింద్రా లిమిటెడ్ ఎండీ గోయంకాను కూడా కేటీఆర్ క‌లిశారు.