నిజామాబాద్: నిజామాబాద్ మేయర్ గా నీతూ కిరణ్ నేడు బాధ్యతలు స్వీకరించారు. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 11వ డివిజన్ నుంచి కార్పొరేటర్‌గా గెలుపొందిన నీతూ కిరణ్ టీఆర్‌ఎస్ పార్టీ అధిష్ఠానం ఆశీస్సులతో మేయర్ పదవిని దక్కించుకున్నారు. నగరంలోని మున్సిపల్ కార్యాలయంలో ఉన్న మేయర్ చాంబరులో ఆమె పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి నూతనంగా ఎన్నికైన కార్పొరేటర్లు హాజరయ్యారు.