కేంద్ర బడ్జెట్‌కు సమయం ఆసన్నమైంది. అయితే ఈసారి ఆదాయం పన్నుపై ఎటువంటి మినహాయింపు ఉంటుందన్నదే ఆసక్తిగా మారింది. 2020 బడ్జెట్‌లో ఐటీ శ్లాబ్‌లో వెసలుబాటు ఉండే అవకాశాలు ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయిదు లక్షల ఆదాయం వరకు పన్ను ఉండదేమో అన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. 5 లక్షల నుంచి 10 లక్షల ఆదాయం వరకు పది శాతం పన్ను వసూల్ చేయనున్నారు. 10 నుంచి 20 లక్షల ఆదాయం వరకు 20 శాతం పన్ను వసూల్ చేయనున్నారు. ఫిబ్రవరి ఒకటవ తేదీన కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.