నగరంలో ట్రాఫిక్‌ను నియంత్రిస్తాం: మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌: నగరంలోని రోడ్లను ఉన్నత ప్రమాణాలతో అభివృద్ధి చేస్తామని రాష్ట్ర ఐటీ, మున్సిపల్‌ శాఖామంత్రి కేటీఆర్‌ అన్నారు. హైదరాబాద్‌ రోడ్లు- ట్రాఫిక్‌పై మంత్రి కేటీఆర్‌ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. నగరంలోని ట్రాఫిక్‌ సమస్యను శాస్త్రీయంగా క్రమబద్దీకరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్టు వ్యవస్థకు ఆదరణ ఎక్కువగా ఉందని మంత్రి అన్నారు. మనదేశంలో.. ముఖ్యంగా ముంబైలో 72 శాతం పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌ను వినియోగిస్తుంటే, హైదరాబాద్‌లో మాత్రం 34 శాతం మాత్రమే పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌ను వినియోగిస్తున్నారని మంత్రి తెలిపారు. నగరంలో ఐదేళ్లలో వాహనాల సంఖ్య 73 లక్షల నుంచి కోటి 20 లక్షలకు పెరిగిందని మంత్రి పేర్కొన్నారు.